Mon Mar 16 2026 01:06:33 GMT+0530 (India Standard Time)
Jagan : పులివెందులలో జగన్ వైపు దూసుకొచ్చిన యువకుడు
జగన్ నామినేషన్ సమయంలో అకస్మాత్తుగా ఒక యువకుడు జగన్ వైపు దూసుకు వచ్చాడు

జగన్ నామినేషన్ సమయంలో అకస్మాత్తుగా ఒక యువకుడు జగన్ వైపు దూసుకు వచ్చాడు. పులివెందుల ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడానికి జగన్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ వచ్చారు. ఈ సమమంలో పోలీసు వలయాన్ని ఛేదించుకుని ఒక యువకుడు జగన్ ప్రయాణిస్తున్న వాహనం వైపునకు దూసుకువచ్చారు.
నామినేషన్ సందర్భంగా...
దీంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. వెంటనే తేరుకున్న పోలీసు సిబ్బంది వెంటనే ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న యువకుడిని సెక్యూరిటీ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. పోలీస్ సిబ్బంది కంట్రోల్ చేయలేకపోవడంతో జగన్ ప్రయాణిస్తున్న వాహనం వైపు యువకులు దూసుకొచ్చారని తెలిసింది.
Next Story

