Sun Feb 01 2026 11:43:07 GMT+0000 (Coordinated Universal Time)
దుర్గగుడిలో విషాదం... భక్తుడు మృతి
శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గగుడి ప్రాంగణంలో విషాదం నెలకొంది. ఒక భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు.

శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గగుడి ప్రాంగణంలో విషాదం నెలకొంది. ఒక భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. భక్తుడు హైదరాబాద్ కు చెందిన మూర్తిగా పోలీసులు గుర్తించారు. ఈరోజు దర్శనానికి వచ్చిన భక్తుడు ఐదు వందల రూపాయల టిక్కెట్ కొనుగోలు చేసి ప్రత్యేక క్యూ లైన్ లో వెళ్లారు.
ఆసుపత్రికి తరలిస్తుండగా...
అయితే ఒక్కసారిగా కుప్ప కూలిపోవడంతో అతనికి వెంటనే అక్కడి సిబ్బంది ప్రాధమిక చికిత్స చేశారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారని పోలీసులు తెలిపారు. క్యూ లైన్లలో ఈరోజు భక్తులు ఎక్కువగా ఉన్నారు. శుక్రవారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక మంది భక్తులు దుర్గగుడికి వచ్చారు.
- Tags
- durga temple
- died
Next Story

