Wed Mar 18 2026 03:31:56 GMT+0530 (India Standard Time)
కార్తీకమాసం ఆరంభంతో శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
కార్తీకమాసం సందర్భంగా భక్తులతో శైవక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి

కార్తీకమాసం సందర్భంగా భక్తులతో శైవక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. ఆదివారం కావడంతో మహాదేవుడి దర్శనానికి రద్దీ మరింత పెరిగింది. నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను మహిళలు వదులుతున్నారు. ఆదివారం కావడంతో స్వామివారిని దర్శించుకుని కార్తీక దీపాలు వెలిగిస్తున్న భక్తులతో శైవ క్షేత్రాలు నిండిపోయాయి.
శివనామస్మరణతో...
శివనామస్మరణతో శైవక్షేత్రాలు మార్మోగుతున్నాయి. రేపు కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో భక్తులు మరింత భక్తి శ్రద్ధలతో ఆలయాలకు వస్తారని భావించి ఆలయాలకు రంగులు వేశారు. ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లను నిర్వాహకులు చేశారు. నదుల వద్ద కూడా ప్రత్యేక ఘాట్లలోనే స్నానాలకు అనుమతిస్తున్నారు.
Next Story

