Fri Dec 05 2025 18:26:11 GMT+0000 (Coordinated Universal Time)
సభలో హెరిటేజ్ అంశం.. పోటీగా వివేకా హత్య... స్పీకర్ ఆగ్రహం
వ్యవసాయ రంగంపై చర్చ సందర్భంగా మంత్రి అప్పలరాజు హెరిటేజ్ విషయాన్ని ప్రస్తావించారు

వ్యవసాయ రంగంపై చర్చ సందర్భంగా మంత్రి అప్పలరాజు హెరిటేజ్ విషయాన్ని ప్రస్తావించారు. హెరిటేజ్ రైతులను మోసం చేసిందన్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. చంద్రబాబుతో సహా సభ్యులు సభను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీనిపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం అడ్డుపడ్డారు.
వివేకా హత్యపై....
వైఎస్ వివేకా హత్యపై చర్చ జరగాలని టీడీపీ నేతలు పట్టుబట్టారు. సభను సజావుగా జరిగేందుకు సహకరించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం పదే పదే సభ్యులను కోరారు. కానీ అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బుచ్చయ్య చౌదరి పదే పదే మంత్రుల ప్రసంగాలకు అడ్డుతగులుతుండటంతో స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు.
Next Story

