Tue Mar 17 2026 08:25:43 GMT+0530 (India Standard Time)
Indrakiladri : నేడు మహిషాసుర మర్ధని రూపంలో దుర్గమ్మ
విజయవాడ ఇంద్రకీలాద్రి పై నేడు దుర్గమ్మ మహిషాసుర మర్దని రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు

విజయవాడ ఇంద్రకీలాద్రి పై నేడు దుర్గమ్మ మహిషాసుర మర్దని రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం నుంచే భక్తులు క్యూలో నిల్చున్నారు. క్యూ అంతా భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్లో ఉన్న మహిళలు, చిన్న పిల్లలు ఇబ్బంది పడకుండా ఆలయ సిబ్బంది భక్తులకు ఉచితంగా పాలు, మజ్జిగ, మంచినీరు అందచేస్తున్నారు.
అధిక సంఖ్యలో...
మహిషాసుర మర్థనిగా అమ్మవారిని చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి రావడంతో ఇంద్రీకీలాద్రి కిటకిటలాడిపోతుంది. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. క్యూలైన్ లలో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆలయ అధికారులు తెలిపారు. వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి.
Next Story

