Tue Mar 17 2026 08:23:48 GMT+0530 (India Standard Time)
నేడు మహాచండీ మాత రూపంలో దుర్గామాత
విజయవాడలోని దుర్గమ్మ గుడి భక్తులతో కిటకిటలాడిపోతుంది. ఉదయం నాలుగు గంటల నుంచే భక్తులు క్యూ లైన్ లో కనిపించారు.

ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. విజయవాడలోని దుర్గమ్మ గుడి భక్తులతో కిటకిటలాడిపోతుంది. ఉదయం నాలుగు గంటల నుంచే భక్తులు క్యూ లైన్ లో కనిపించారు. ఈరోజు మహాచండీ మాత రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఐదో రోజు దుర్గాగుడిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభంగా ప్రారంభమయ్యాయి.
కిటకిటలాడుతున్న...
భక్తులు వేలాది మంది తరలి రావడంతో పోలీసులు కూడా క్యూ లైన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎటువంటి తొక్కిసలాట జరగకుండా అందరినీ అమ్మవారి దర్శనానికి పంపుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలి రావడంతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడిపోతుంది. క్యూలైన్ లో ఉన్న వారికి మజ్జిగ, మంచినీటిని అందచేస్తున్నారు.
Next Story

