Wed Mar 18 2026 11:03:44 GMT+0530 (India Standard Time)
నేడు రాజరాజేశ్వరిదేవిగా దుర్గాదేవి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేడు శరన్నవరాత్రి వేడుకలు ముగియనున్నాయి. ఈరోజు దుర్గమ్మ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తున్నారు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేడు శరన్నవరాత్రి వేడుకలు ముగియనున్నాయి. ఈరోజు దుర్గమ్మ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తున్నారు. దీంతో ఉదయం నుంచే విజయదశమి రోజు వేలాది మంది వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. క్యూలైన్ లలో భక్తుతో నిండిపోయాయి. దేవీ శరన్నవరాత్రులు నేటితో ముగియనున్నాయి. నేటికి ఉత్సవాలు పదోరోజుకు చేరుకున్నాయి.
తెప్పోత్సవంతో...
ఈరోజు రాత్రికి తెప్పోత్సవంతో ఉత్సవం ముగియనుంది. చివరి రోజు కావడంతో భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. పండగ రోజు కావడంతో అమ్మవారిని దర్శించుకుంటే పుణ్యమని భావించి దుర్గగుడికి చేరుకుంటున్నారు. దీంతో పోలీసులు క్యూ లైన్లో ఉన్న వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుని దర్శనం పూర్తయ్యేలా చేస్తున్నారు.
Next Story

