Tue Dec 16 2025 02:03:38 GMT+0000 (Coordinated Universal Time)
దుర్గగుడి ఛైర్మన్ గా కర్నాటి రాంబాబు
దుర్గగుడి పాలకమండలిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది

దుర్గగుడి పాలకమండలిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దుర్గగుడి ఆలయ కమిటీ ఛైర్మన్ గా కర్నాటి రాంబాబును నియమించింది. కర్నాటి రాంబాబు బలహీనవర్గాలకు చెందిన వ్యక్తి. ఆయనకు ఎటువంటి సిఫార్సు లేకుండానే ఈ పదవి లభించింది.
ధార్మిక భావాజాలమున్న...
కర్నాటి రాంబాబు అనేక సార్లు అయ్యప్ప దీక్ష చేపట్టి శబరిమలై వెళ్లొచ్చారు. అమ్మవారి ఆలయానికి ధార్మిక భావాజాలాన్ని వ్యక్తులను నియమించాలన్న జగన్ ఆదేశంతో కర్నాటి రాంబాబు నియామకం జరిగిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు. దుర్గగుడిలో పాలకమండలి ఏకపక్ష నిర్ణయాలకు ఇక చెక్ పెట్టినట్లేనని భావిస్తున్నారు.
Next Story

