Wed Mar 18 2026 05:22:01 GMT+0530 (India Standard Time)
నేడు మహా పాదయాత్రకు బ్రేక్
భారీ వర్షాలకు అమరావతి రాజధాని రైతుల మహా పాదయాత్రకు బ్రేక్ పడింది.

భారీ వర్షాలకు అమరావతి రాజధాని రైతుల మహా పాదయాత్రకు బ్రేక్ పడింది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న యాత్రకు ఈరోజు రైతులు విరామం ప్రకటించారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఈరోజు పాదయాత్ర చేయకూడదని నిర్ణయించారు.
భారీ వర్షాలకు....
గత 27 రోజులుగా అమరావతిలోనే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు మహా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలసిందే. అయితే భారీ వర్షాల కారణంగా ఈరోజు పాదయాత్రకు బ్రేక్ నిచ్చారు. డిసెంబరు 15వ తేదీన మహాపాదయాత్ర తిరుమల చేరుకోవాల్సి ఉంది. వరసగా కురుస్తున్న వర్షాల కారణంగా పాదయాత్ర తిరుమల చేరుకోవడానికి ఆలస్యం అయ్యే అవకాశముంది.
Next Story

