Sat Mar 07 2026 17:33:28 GMT+0530 (India Standard Time)
Gannavaram : గాలిలోనే రెండు విమానాలు.. ల్యాండింగ్ కు అనుమతి రాక
గన్నవరం ఎయిర్పోర్టులో పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది

గన్నవరం ఎయిర్పోర్టులో పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రెండు విమానాలలు గాలిలో చక్కర్లు కొడుతున్నాయి. విపరీతంగా కురుస్తున్న పొగమంచు కారణంగా రన్ వే తో పాటు సిగ్నల్స్ కూడా కనిపించకపోవడంతో విమానాలు ఎయిర్పోర్టులో దిగేందుకు అవకాశం లేకుండా పోయింది.
పొగమంచు కారణంగా...
దీంతో చెన్నై, హైదరాబాద్ నుంచి వచ్చిన విమానాలు గన్నవరం ఎయిర్ పోర్టుపైనే ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయి. ఇవి రెండు ఇండిగో సంస్థకు చెందిన విమానాలు. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. పొగమంచు కారణంగా ఎయిర్పోర్టు అధికారులు ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వకపోవడంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Next Story

