Sat Mar 07 2026 16:17:00 GMT+0530 (India Standard Time)
వరస సెలవులు.. ఇంతటి క్యూ లైనా?
వరస సెలవులు కావడంతో తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. క్యూ లైన్లన్నీ నిండిపోయాయి

వరస సెలవులు కావడంతో తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి బయట వరరకూ క్యూ లైన్ కొనసాగుతుంది. అక్టోపస్ బిల్డింగ్ వరకూ భక్తులు క్యూ లైన్ లో నిల్చుని ఉన్నారు. స్వామి వారి దర్శనం కోసం క్యూ లైన్ కోసం వేచి చూస్తున్నారు.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 66,233 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరిలో 36,486 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.71 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. సోమవారం వరకూ ఇదే రకంగా భక్తుల రద్దీ కొనసాగుతుందని అధికారులు అంచనా వేసి అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story

