Tue Mar 17 2026 11:51:51 GMT+0530 (India Standard Time)
Amarvathi : నేటి నుంచి అమరావతిలో డ్రోన్ సమ్మిట్
అమరావతిలో ఈరోజు నుంచి డ్రోన్ సమ్మిట్ జరగనుంది. రెండు రోజుల పాటు ఈ సమ్మిట్ జరగనుంది.

అమరావతిలో ఈరోజు నుంచి డ్రోన్ సమ్మిట్ జరగనుంది. రెండు రోజుల పాటు ఈ సమ్మిట్ జరగనుంది. ఈ నెల 22, 23 తేదీల్లో డ్రోన్ సమిట్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. సీకే కన్వెన్షన్ సెంటర్ లో డ్రోన్ సదస్సు, డ్రోన్ హ్యాకథాన్, . డ్రోన్ సమిట్ ఏర్పాటుకు పెద్దఎత్తున ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుంది.
రెండురోజల పాటు...
ఈ నెల 22న విజయవాడ పున్నమి ఘాట్ వద్ద 5,500 డ్రోన్లతో డ్రోన్ షో ను నిర్వహిస్తున్నారు. ఈ డ్రోన్ షో చూసేందుకు వేలాది మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. డ్రోన్ సమిట్ కు హాజరుకానున్న ఇన్వెంటర్లు, ఇన్వెస్టర్లు, ఐఐటీల ప్రతినిధులు కూడా హాజరు కానున్నారు. డ్రోన్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్, మంత్రి జనార్థన్ రెడ్డిలు పాల్గొంటారు.
Next Story

