Sun Feb 01 2026 21:16:33 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్టీసీ డ్రైవర్ గా మారిన కొడాలి నాని
కొడాలి నాని గుడివాడలో ఆర్టీసీ బస్సును నడపడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది

మాజీ మంత్రి కొడాలి నాని ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఆయన ఏది చేసినా సంచలనమే. ఆయన మీడియా సమవేశంలో కూడా పంచ్ లు పేలుతాయి. తాజాగా కొడాలి నాని గుడివాడలో ఆర్టీసీ బస్సును నడపడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ లో ఐదు అద్దె బస్సులను కొడాలి నాని ప్రారంభించారు.
బస్సులను ప్రారంభించి...
అయితే ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన కొడాలి నాని అంతటితో ఊరుకోలేదు. డ్రైవర్ సీట్లోకి ఎక్కి తాళం తీసుకుని స్టార్ట్ చేసి రోడ్లపై పరుగులు తీయించాడు. గుడివాడ బస్టాండ్ నుంచి స్వయంగా బస్సు నడుపుకుంటూ గుడివాడ ప్రధాన రహదారులలో తిరిగారు. తిరిగి సేఫ్ గా బస్టాండ్ కు చేరుకున్నారు. ఇది చూసిన ఆర్టీసీ అధికారులు, పార్టీ నేతలు ఆశ్చర్యానికి గురయ్యారు.
Next Story

