ఏపీలో తెగ తాగుతూ.. టాప్ లో ఏ జిల్లా ఉందంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. బీరు అమ్మకాలు ఏకంగా 129 శాతం పెరిగాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. బీరు అమ్మకాలు ఏకంగా 129 శాతం పెరిగాయి. లిక్కర్ విక్రయాలు దాదాపు 24 శాతం పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 82.98 లక్షల కేసుల మద్యం అమ్మితే, ఈ ఆర్థిక సంవత్సరంలో 102.7 లక్షల కేసుల మద్యం అమ్ముడైంది. బీరు గతేడాది మొదటి క్వార్టర్లో 28.22 లక్షల కేసులు అమ్మితే, ఈ ఏడాది మొదటి క్వార్టర్లో 64.6లక్షల కేసులు అమ్మారు. గతేడాది మొదటి క్వార్టర్లో 7,086 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్ముడైతే, ఈ ఏడాది అది 7,889కోట్ల రూపాయలకు పెరిగింది. గతేడాది 6050.87కోట్ల ఆదాయం వస్తే, ఈ ఏడాది 6899 కోట్లు ఆదాయం వచ్చింది. నెలకు 2300 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరుతోంది. మద్యం అమ్మకాల్లో తిరుపతి టాప్లో నిలిచింది. మొదటి క్వార్టర్లో 494 కోట్ల రూపాయల అమ్మకాలు నమోదయ్యాయి. విశాఖపట్నంలో 492 కోట్ల రూపాయలు, నెల్లూరులో 416కోట్ల రూపాయలు, ఎన్టీఆర్ జిల్లాలో 408 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. అత్యల్పంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో 71కోట్ల రూపాయల మద్యం అమ్ముడైంది.

