Sun Mar 08 2026 10:51:07 GMT+0530 (India Standard Time)
క్రిటికల్ గానే తారకరత్న ఆరోగ్యం
సినీనటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు

సినీనటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. వెంటిలేటర్ తో పాటు అత్యాధునిక పరికరాలతో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు చెప్పారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో తారకరత్నకు చికిత్స కొనసాుతుంది.
అత్యాధునిక చికిత్స ద్వారా...
ఎక్మో ద్వారా చికిత్స అందస్తున్నామని ప్రచారంలో నిజం లేదన్నారు. వైద్యులు తమ శక్తి మేరకు ఆయన ఆరోగ్యం కుదుట పడేందుకు ప్రయత్నిస్తున్నారని, అత్యాధునిక చికిత్సను అందచేస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇంకా ఆయన ఆరోగ్యం కుదుట పడలేదని వైద్యులు తెలిపారు. ఈ మేరకు హెల్త్ బులిటెన్లో పేర్కొన్నారు.
Next Story

