Thu Jan 22 2026 01:33:40 GMT+0000 (Coordinated Universal Time)
నేడు తారకరత్నకు శస్త్ర చికిత్స
తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతుందని నారాయణ హృదయాలయ వైద్యులు తెలిపారు.

తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతుందని నారాయణ హృదయాలయ వైద్యులు తెలిపారు. గుండె, కాలేయం ఇతర అవయవాలన్నీ బాగున్నాయని చెప్పారు. అయితే మెదడుకు సంబంధిత చికత్స జరుగుతున్నట్లు తెలిపారు. గత కొన్ని రోజలుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న తారకరత్న రోజురోజుకు మెరుగుపడుతుంది. ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తుంది.
బాలకృష్ణతో చర్చించి...
ఈరోజు ఉదయం బాలకృష్ణ నారాయణ హృదయాలయకు చేరుకుని వైద్యులతో మాట్లాడారు. వెంటిలేటర్ సాయంతోనే తారకరత్నకు వైద్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. మెదడుకు సంబంధించిన చికత్సను చేయబోతున్నట్లు తెలిపారు. బాలకృష్ణతో పాటు తారకరత్న కుటుంబ సభ్యులు బెంగళూరుకు చేరుకున్నారు.
Next Story

