Sat Dec 06 2025 07:43:26 GMT+0000 (Coordinated Universal Time)
మూడు పెళ్లిళ్లపై పవన్ ఏమన్నారంటే?
మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని మూడు రాజధానులు కోరుకుంటారా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

జనసేన అధినేత తనపై వస్తున్న విమర్శలకు సమాధానమిచ్చారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని మూడు రాజధానులు కోరుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు. తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్న మాట వాస్తవమేనని, విడాకులు తీసుకుని మీరు కూడా చేసుకోండని, ఎవరు కాదన్నారని ఆయన నిలదీశారు. ప్రతిసారీ మూడు పెళ్లిళ్లలంటూ తనపై విమర్శలు చేయడం ఇకనైనా మానుకోవాలని పవన్ హితవు పలికారు.
ఎవరైనా చేసుకోవచ్చు...
తాను వారితో పడకనే మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని, మీరు కూడా చేసుకోవచ్చని తెలిపారు. తాను ముంబయిలో నటన నేర్చుకుంటే ముంబయిని రాజధానిగా చేయమంటానా? అని ప్రశ్నించారు. పిచ్చి మాటలను కట్టిపెట్టి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచించాలని అధికార పార్టీ వైసీపీ నేతలకు ఆయన తెలిపారు. ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టడం కాదని, శాంతిభద్రతలను సక్రమంగా ఉంచాలని అన్నారు. అరెస్ట్ అయిన తమ వారిని విడిపించుకునేందుకు ఏం చేయాలన్న దానిపై తము ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Next Story

