Fri Dec 05 2025 17:47:56 GMT+0000 (Coordinated Universal Time)
Diwali : దీపావళి సామాగ్రి తయారీలో పాటించాల్సిన జాగ్రత్తలివే.. మరో కోనసీమ ఘటన కాకుండా?
దీపావళి పండగకు దగ్గర పడుతుంది. బాణాసంచా తయారీ ఊపందుకుంది

దీపావళి పండగకు దగ్గర పడుతుంది. బాణాసంచా తయారీ ఊపందుకుంది. దీపావళి పండగనాడు భారీగా బాణాసంచా విక్రయాలు జరగనుండటంతో వాటి తయారీ కూడా ఊపందుకుంది. అయితే ఇటీవల కోనసీమ బిఆర్ అంబేద్కర్ జిల్లా రాయవరంలో దీపావళి బాణా సంచా తయారీ కోసం పనులు చేస్తున్న ఏడుగురు మృతి చెందిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ఆంధ్రప్రదేశ్ లో కేవలం తూర్పు గోదావరి జిల్లాలో మాత్రమే కాదు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కుటీర పరిశ్రమగా ఇది ఉంది. దీపావళి మందులు తయారీలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ సరైన చర్యలు పరిశ్రమల యజమానులు తీసుకోవడం లేదు. దీంతో ఏటా ప్రాణనష్టం జరుగుతూనే ఉంది.
పండగ సమయంలో...
దీపావళి బాణాసంచా తయారీలో ప్రతి ఏడాది 40 మంది వరకూ ప్రాణాలు కోల్పోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. కోనసీమ, శ్రీకాకుళం, పల్నాడు జిల్లాల్లో ఎక్కువగా తయారయి ఇవి రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇందుకోసం నిబంధనలను కఠినతరం చేసింది. నిబంధనలను పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. కోనసీమ లో జరిగిన ప్రమాదం మరొకసారి జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. అధికారులు ఇచ్చిన కిలోల పరిమితి మేరకు మాత్రమే వ్యాపారులు నిల్వ చేసుకోవాలని, ప్రభుత్వ నియమ నిబంధనలు ప్రకారం విక్రయించాలని, ఫైర్ సేఫ్టీన్ కూడా పరిగణలో తీసుకొని షాపులో బాణాసంచా విక్రయాలు జరగాలని ఇప్పటికే వ్యాపారులకు వార్నింగ్ ఇచ్చారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలతో పాటు భారీగా జరిమానాను విధిస్తామని తెలిపారర.
నియమ నిబంధనలివే :
బాణసంచా విక్రయించాలంటే తప్పనిసరిగా లైసెన్స్ పొందాలి.
దీపావళి వంటి పండుగల సమయంలో తాత్కాలికంగా విక్రయాలు జరిపేందుకు లైసెన్స్ తీసుకోవాలి. దీ
ఏడాది పొడవునా విక్రయాలు లేదా నిల్వ చేయాలనుకునే వారు శాశ్వత లైసెన్స్ తీసుకోవాలి.
లైసెన్స్‌లో ఎన్ని కిలోల బాణసంచా నిల్వ ఉంచాలి అనే పరిమితిని స్పష్టంగా పేర్కొంటారు. వ్యాపారస్తులు తప్పనిసరిగా ఈ పరిమితిని పాటించాలి.
ప్రమాదాలను నివారించడానికి షాపుల్లో మరియు నిల్వ గోదాముల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలి:
అధిక శబ్దం చేసే (లేదా పర్యావరణానికి హాని కలిగించే ప్రమాదకర బాణసంచాను విక్రయించడం నిషేధం.
భారీగా జరిమానా...
నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై లైసెన్స్ రద్దు చేయడం, భారీ జరిమానాలు విధించడం మరియు చట్టపరంగా కేసులు నమోదు చేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోనసీమలో జరిగిన ఘోరం వంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే, వ్యాపారస్తులు కచ్చితంగా ప్రభుత్వ నియమ నిబంధనలను పాటించాలని కోరారు. బాణసంచా కొనుగోలు చేసే ప్రజలు కూడా అనుమతి పొందిన, సురక్షితమైన ప్రదేశాల నుండే కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
Next Story

