Mon Mar 16 2026 11:44:15 GMT+0530 (India Standard Time)
ఈరోజూ పిడుగులు పడతాయ్
ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కూడా పిడుగులు పడే అవకాశముందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కూడా పిడుగులు పడే అవకాశముందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వ్యవసాయ పనుల్లో రైతులు, కూలీలు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది. చెట్ల కింద ఉండవద్దని సూచించింది. కర్ణాటక, తమిళనాడు మీదుగా కొనసాగుతున్న ద్రోణి దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ఈ జిల్లాల్లో...
ఈరోజు శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఏలూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురనున్నాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని ఏపీ విపత్తుల సంస్థ తెలిపింది.
Next Story

