Sat Mar 07 2026 23:40:17 GMT+0530 (India Standard Time)
మరికాసేపట్లో పిడుగులు పడతాయ్
ఆంధ్రప్రదేశ్లో మరికాసేపట్లో పిడుగులు పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్లో మరికాసేపట్లో పిడుగులు పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పిడుగులు పడే అవకాశముందని తెలిపింది. పశువుల కాపర్లు, కూలీలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. వాయువ్య మధ్యప్రదేశ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు కొనసాగుతున్న ద్రోణి దీని ప్రభావంతో ఈరోజు అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
రేపు కూడా...
ఈరోజు ఉభయగోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు అలాగే మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ వార్నింగ్ ఇచ్చింది.
Next Story

