Wed Mar 18 2026 23:05:24 GMT+0530 (India Standard Time)
నేడు కూడా పిడుగుల వర్షమే
ఆంధ్రప్రదేశ్లో నేడు కూడా పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్లో నేడు కూడా పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి సీతారామరాజు, మన్యం జిల్లాలతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాలో కూడా పిడుగులు పడతాయని హెచ్చరించింది.
రాయలసీమలోనూ...
పిడుగులతో పాటు ఉరుములతో కూడిన భారీ వర్షం నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. ద్రోణి ప్రభావంతో ఈ అకాల వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశముందని చెప్పింది. పొలాల్లోకి వెళ్లే రైతులు జాగ్రత్తలు పాటించాలని, చెట్ల కిందకు చేరవద్దని సూచించింది
Next Story

