Mon Mar 16 2026 12:22:33 GMT+0530 (India Standard Time)
మూడు రోజులు మండే ఎండలు
రాబోయే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది

రాబోయే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈరోజ 136 మండలాల్లో తీవ్రవడగాల్పులు ఉంటాయని తెలిపింది. రేపు 153 మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశముందని తెలిపింది. ఎండడ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల సంస్థ సూచించింది.
47 డిగ్రీల వరకూ...
ఈరోజు విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్లుండి కూడా వడగాల్పులతో పాటు ఎండవేడిమి కూడా అధికంగా ఉండే అవకాశముందని అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించింది.
Next Story

