Tue Mar 17 2026 01:17:13 GMT+0530 (India Standard Time)
నేడు కూడా పిడుగులు పడే అవకాశం
నేడు కూడా ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తాయని విపత్తుల సంస్థ తెలిపింది

నేడు కూడా ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తాయని విపత్తుల సంస్థ తెలిపింది. విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ,కర్ణాటక మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిది.
జాగ్రత్తగా ఉండాలని...
ఈరోజు మన్యం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. పశ్చిమగోదావరి, ఏలూరు, సత్యసాయి,అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. రైతులు, కూలీలు,గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలని, పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ హెచ్చరించింది.
Next Story

