Thu Mar 19 2026 05:49:41 GMT+0530 (India Standard Time)
గన్నవరం నుంచి నేరుగా కువైట్కు
విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కువైట్ విమాన సర్వీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది.

బెజవాడ విమాన ప్రయాణికులకు మరో సౌకర్యం నేటి నుంచి ఏర్పాటు కానుంది. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కువైట్ విమాన సర్వీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఎయిర్ ఇండియా ఆధ్వర్యంలో ఈ విమాన సర్వీసులు నడవనున్నాయి.
నేటి నుంచి...
కువైట్కు వెళ్లే ప్రయాణికులు నేరుగా ఇక విజయవాడ నుంచి వెళ్లే అవకాశముంది. ప్రతి బుధవరం ఈ ప్రత్యేక విమాన సర్వీసు అందుబాటులో ఉంటుందని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. నేటి నుంచి అక్టోబరు 28వ తేదీ వరకూ ఈ విమాన సర్వీసులు నడుస్తాయి. ఉదయం 9.55 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టులో బయలుదేరి మధ్యాహ్నం 2.40 గంటలకు కువైట్ చేరుకుంటుంది. తిరిగి అక్కడ 3.40 గంటలకు బయలుదేరి రాత్రి 8.35 గంటల ప్రాంతంలో గన్నవరం చేరుకుంటుంది.
Next Story

