Mon Mar 16 2026 02:23:09 GMT+0530 (India Standard Time)
బాబు ఆరోగ్యంపై దుష్ప్రచారం వద్దు : డీఐజీ
చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై దుష్ప్రచారం చేయడం తగదని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ తెలిపారు

చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై దుష్ప్రచారం చేయడం తగదని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందన్నారు. చంద్రబాబుకు తమ జైలులో ఉన్న వైద్యాధికారులు నిత్యం పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన ఆరోగ్యంపై ఎలాంటి భయాలు అవసరం లేదని రవికిరణ్ చెప్పారు. చంద్రబాబుకు కొంత డీహైడ్రేషన్ కు గురై చర్మ సంబంధిత సమస్యలు తలెత్తిన మాట వాస్తవమేనని, వెంటనే వైద్యులను రప్పించి చికిత్స అందించామని ఆయన తెలిపారు.
అన్ని రకాలుగా...
తాగునీరు, భోజనం విషయంలో నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్కిన్ సమస్య వచ్చిన వెంటనే ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించి తగిన వైద్యాన్ని అందించామని చెప్పారు. ఆరోగ్య పరంగానే కాదు భద్రతాపరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని ఆయన తెలిపారు. ఒక హెడ్ వార్డెన్, ఆరుగురు వార్డెన్లతో స్నేహ బరాక్ వద్ద భద్రతను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మొదటి నుంచి ఆయనను హై ప్రొఫైల్ ఖైదీగానే చూస్తున్నామని తెలిపారు. బయట నుంచి వచ్చిన భోజనాన్ని పరీక్షించి మరీ లోపలికి పంపుతున్నామని ఆయన తెలిపారు.
Next Story

