Wed Mar 18 2026 08:02:09 GMT+0530 (India Standard Time)
నగరిలో జగన్ ఫ్లెక్సీల చించివేత... ఉద్రిక్తత
నగరిలో వైసీపీ లో విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఫ్లెక్సీలను కొందరు చించివేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది

నగరి నియోజకవర్గంలో వైసీపీ లో వర్గ విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఇవి మరింత ముదిరాయి. వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, ఆమె వ్యతిరేకవర్గం పోటా పోటీగా జగన్ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించేందుకు సిద్ధపడ్డాయి. ఇందుకోసం నగరి నియోజకవర్గంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
ఫ్లెక్సీలు చించివేయడంతో...
కానీ జగన్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు చించివేయడంతో వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమ వర్గానికి చెందిన వారి ఫ్లెక్సీలను చించి వేశారని, ఆర్కే రోజా వర్గీయులే ఈ దారుణానికి పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు. నగరి నియోజకవర్గంలో ఆర్కే రోజా ఒక వర్గంగానూ, కేజే కుమార్ మరొక వర్గంగానూ విడిపోయి జగన్ జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నారు.
Next Story

