Thu Dec 18 2025 22:57:45 GMT+0000 (Coordinated Universal Time)
పరిటాల శ్రీరామ్ కు కరోనా పాజిటివ్ !
మంత్రి కొడాలి నాని, వంగవీటి రాధ, శ్రీశైలం ఎమ్మెల్యేలకు ఇటీవలే కరోనా నిర్థారణ అయింది. తాజాగా ధర్మవరం

ఏపీ రాజకీయ నేతలను కరోనా చుట్టుముడుతోంది. మంత్రి కొడాలి నాని, వంగవీటి రాధ, శ్రీశైలం ఎమ్మెల్యేలకు ఇటీవలే కరోనా నిర్థారణ అయింది. తాజాగా ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ కు కరోనా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. తనకు స్వల్ప లక్షణాలుండటంతో.. కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా తేలిందన్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని శ్రీరామ్ సూచించారు.
కాగా.. ఏపీలో కరోనా కోరలు చాచింది. మొన్న రెండు వేలకు పైగా కేసులు నమోదవ్వగా.. నిన్న విడుదలైన కరోనా బులెటిన్ లో ఏకంగా 4 వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. ఒమిక్రాన్, కరోనా శరవేగంగా వ్యాప్తిచెందడానికి తోడు.. వాతావరణంలో చోటుచేసుకున్న అనూహ్య మార్పులు కూడా కోవిడ్ వ్యాప్తికి కారణమవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లోనూ నైట్ కర్ఫ్యూ విధించగా.. ఏపీలో ఈనెల 18వ తేదీ నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది.
Next Story

