Tue Apr 07 2026 13:39:10 GMT+0530 (India Standard Time)
Dharmana : రాజధాని అమరావతిపై ధర్మాన హాట్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు హాట్ కామెంట్స్ చేశారు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు హాట్ కామెంట్స్ చేశారు. అమరావతి నిర్మాణపై లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మిగిలిన ప్రాంతాల్లో ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికే అప్పలు చేసి అమరావతికి లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఏదైనా రాజధాని అనేది నిదానంగా, అభివృద్ధి చెందాలని, బిల్డింగ్ లు కడితే అభివృద్ధి చెందినట్లు కాదని ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు.
లక్షల కోట్ల భారం...
రాబోయే తరాలపై లక్షల కోట్ల రూపాయల అప్పుల భారం మోపి ఏం చేద్దామనుకుంటున్నారని కూటమి ప్రభుత్వాన్ని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. అన్ని ప్రాంతాలకు సమానంగా న్యాయం జరిగినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. రాజధాని అమరావతిపై ఇప్పటికైనా చంద్రబాబు తన ఆలోచనలు మార్చుకోవాలని సూచించారు.
Next Story

