Thu Mar 19 2026 17:52:48 GMT+0530 (India Standard Time)
పవన్ కామెంట్స్ పై డీజీపీ స్ట్రాంగ్ రియాక్షన్
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై డీజీపీ ద్వారకా తిరుమల రావు స్పందించారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై డీజీపీ ద్వారకా తిరుమల రావు స్పందించారు. తాము రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లతో పనిచేయబోమని ఆయన తెలిపారు. వాస్తవ పరిస్థితుల ఆధారంగానే కేసులను విచారిస్తామని ఆయన తెలిపారు. తమకు జవాబు దారీ తనం ఉంటుందని ద్వారకా తిరుమల రావు తెలిపారు.
గతంలో జరిగిన పొరపాట్లు...
గత ప్రభుత్వంలో కొన్ని పొరపాట్లు జరిగాయని, వాటిని సరిదిద్దుకుంటూ తాము పనిచేస్తున్నామని ద్వారకా తిరుమల రావు తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు ఈ ప్రభుత్వంలో జరగవని ఆయన తెలిపారు. తాము నిర్దోషులెవరో? దోషులెవరో? గుర్తించి శాంతిభద్రతల పరిరక్షణకు పనిచేస్తామని తెలిపారు.
Next Story

