Fri Jan 30 2026 16:00:18 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : నడకదారిలో రెండు చిరుతలు.. భక్తులలో ఆందోళన
తిరుమల నడక దారిలో రెండు చిరుతలు తిరుగుతున్నట్లు భక్తులు గుర్తించారు

తిరుమలలో మళ్లీ చిరుత సంచారం కలకలం రేపింది. నడక దారిలో రెండు చిరుతలు తిరుగుతున్నట్లు భక్తులు గుర్తించారు. సీసీ కెమెరాల ద్వారా కూడా చిరుత కదలికలను గుర్తించడతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. నడక దారి వచ్చే భక్తులకు రక్షణ కల్పించేలా సెక్యూరిటిని తీవ్రతరం చేయనున్నారు.
సెక్యూరిటీని ...
నడకదారిలో ఆఖరి మెట్టు పై రెండు చిరుతలు వెళ్లినట్లు భక్తులు గమనించడంతో దానిని అధికారులకు తెలిపారు. తర్వాత సీసీ కెమెరాల ద్వారా ధృవీకరించుకున్న అధికారులు వాటిని పట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు గుంపులుగా మాత్రమే వెళ్లాలని, ఒంటరిగా, చిన్న పిల్లలను తీసుకుని వెళ్లవద్దని సూచిస్తున్నారు.
Next Story

