Tue Mar 24 2026 11:16:11 GMT+0530 (India Standard Time)
తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన రష్
వరస సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. దర్శనానికి 30 గంటల సమయం పడుతుంది.

తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. వరస సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టమెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భక్తులు రద్దీ పెరిగిందని, పెరటాసి మాసం మూడో శనివారంతో పాటు వరస సెలవులతో భక్తుల రద్దీ పెరిగింది.
30 గంటల సమయం...
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని రెండు, నారాయణగిరి ఉద్యానవనాల్లోని అన్ని షెడ్ లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిల్పాతోరణం వరకూ చేరుకుందని అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి అధికారులతో సహకరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కోరుతున్నారు.
Next Story

