Wed Mar 25 2026 04:12:47 GMT+0530 (India Standard Time)
సర్వ దర్శనం టోకెన్ల కోసం?
తిరుమల వెంకటేశ్వరస్వామి సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలి వచ్చారు

తిరుమల వెంకటేశ్వరస్వామి సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలి వచ్చారు. తిరుపతి లోని భూదేవి కాంప్లెక్స్ లో భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు. రేపటి శ్రీవారి దర్శనం కోసం ఈ టోకెన్లు జారీ చేయనున్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి టోకెన్లు జారీ చేసే కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
వీకెండ్ కావడంతో....
శని, ఆదివారాలు కావడంతో భక్తుల సంఖ్య బాగా పెరిగింది. దీంతో పోలీసులు పెద్దయెత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. టోకెన్ల జారీ కోసం ఈరోజు అధికారులు ప్రకటన చేయడంతో వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.
Next Story

