Tue Mar 03 2026 14:05:36 GMT+0530 (India Standard Time)
ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు భారీ విరాళం
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు భారీ విరాళాన్నిభక్తులు అందించారు

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు భారీ విరాళాన్నిభక్తులు అందించారు. విజయవాడ, చెరువు సెంటర్ ప్రాంతానికి చెందిన భక్తులు దొడ్ల నారాయణ రావు ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి 100 గ్రాముల స్వచ్ఛమైన బంగారు కడ్డీనికానుకగా సమర్పించారు. దీని విలువ సుమారు పదిహేడులక్షలరూపాయలు ఉంటుందని తెలిపారు.
స్వచ్ఛమైన బంగారంతో..
దాత దొడ్ల నారాయణ రావు అమ్మావారికి కానుకగా 100 గ్రాముల స్వచ్ఛమైన బంగారాన్నిఅందించారని, దీని సుమారు విలువ16,87,100 ఉంటుందని ఆలాయ అధికారులు తెలిపారు. అమ్మవారికి బంగారాన్ని సమర్పించిన దాతను ఆలయ అధికారులు అభినందించారు. వారికి అమ్మవారి దర్శనం చేయించి తీర్ధప్రసాదాలను అందచేశారు.
Next Story

