Sun Dec 14 2025 02:39:37 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ సర్కార్ పై దేవినేని ఫైర్
వైసీపీ ప్రభుత్వం పై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన చేతకాకుంటే దిగిపోవాలని సూచించారు.

వైసీపీ ప్రభుత్వం పై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన చేతకాకుంటే దిగిపోవాలని సూచించారు. ఏపీలో విద్యుత్ కోతలను అమలు చేస్తున్నారన్నారు. ఎండాకాలం రాకముందే కోతలు పెడుతున్నారంటే విద్యుత్తు రంగంలో వీరికి ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థమవుతుందన్నారు.
చేతకాకపోతే....
ఎన్టీపీసీకి ఉన్న బకాయీలు చెల్లించక పోవడం వల్లనే రెండు వేల మెగావాట్ల విద్యుత్తును నిలిపివేశారని దేవినేని ఉమ అన్నారు. ఇంతకంటే సిగ్గు చేటు మరొకటి ఉండదన్నారు. కేవలం దోచుకునేదానిపై పెట్టే శ్రద్ధ ప్రజావసరాలు, సౌకర్యాలపై ఈ ప్రభుత్వం పెట్టడం లేదని దేవినేని ఉమ ఫైర్ అయ్యారు.
- Tags
- devineni uma
- tdp
Next Story

