Sat Mar 07 2026 06:24:57 GMT+0530 (India Standard Time)
Vijayawada : దుర్గమ్మ దర్శనానికి వీరు ఈ సమయాల్లో రావద్దు
విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చేవారికి ముఖ్య సూచనలను దేవస్థానం అధికారులు పలు సూచనలు చేశారు

విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చేవారికి ముఖ్య సూచనలను దేవస్థానం అధికారులు పలు సూచనలు చేశారు. వీఐపీలు, దివ్యాంగులు, వృద్ధులు, అన్ని శాఖల అధికారులు ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనానికి ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30లోపు రావొద్దని దుర్గగుడి ఈవో కేఎస్ రామారావు విజ్ఞప్తి చేశారు.
ఈ వేళల్లో రావద్దంటూ...
ఉదయం 11.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు మహా నైవేద్యం జరుగుతుందని, అందువలన ఈ విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. కనదుర్గమ్మ దేవస్థానంలో అభివృద్ధి పనులు జరుగుతున్నందున ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల లోపు మినహా మిగతా సమయాల్లో దర్శనానికి రావాలని ఈవో వీఐపీలకు, దివ్యాంగులకు, వృద్ధులను కోరారు.
Next Story

