Fri Dec 05 2025 12:47:45 GMT+0000 (Coordinated Universal Time)
నేడు గుంటూరు జిల్లా జైలుకు రఘురామ కృష్ణరాజు
నేడు గుంటూరు జిల్లా జైలుకు రఘురామ కృష్ణరాజు రానున్నారు.

నేడు గుంటూరు జిల్లా జైలుకు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు రానున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో నాటి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న తనపై కస్టోడియల్ టార్చర్ పై నిందితుడిని గుర్తించేందుకు రఘురామ కృష్ణరాజు గుంటూరు జిల్లా జైలుకు రానున్నారు. కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడి గుర్తింపు పరేడ్ నేడు జరగనుంది.
న్యాయమూర్తి సమక్షంలో...
జిల్లా న్యాయమూర్తి సమక్షంలో పరేడ్ ను పోలీసులు నిర్వహించనున్నారు. రఘురామపై హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న తులసిబాబును ఇటీవల అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. రిమాండ్ విధించారు. అయితే ఈ ఈ కేసులో తనకు సంబంధం లేదంటూ తులసిబాబు న్యాయస్థానాన్నిఆశ్రయించారు. తులసిబాబు పోలికలు ఉన్నవారితో గుర్తింపు పరేడ్ ను పోలీసులు నిర్వహించనున్నారు.
Next Story

