Sun Mar 15 2026 20:19:43 GMT+0530 (India Standard Time)
టీడీపీ లో చేరుతున్న కీలక నేత
పార్వతీపురంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఆడపడుచు పల్లవి రాజు టీడీపీలో చేరుతున్నారు

పార్వతీపురంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పుష్ప శ్రీవాణి ఆడపడుచు పల్లవి రాజు టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తన తండ్రి శత్రుచర్ల చంద్రశేఖర్ రాజుతో కలిసి ఆమె విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. పుష్పశ్రీవాణి భర్త పరీక్షిత్ రాజుకు సొంత చెల్లెలుగా పల్లవి రాజు ఉన్నారు.
కుటుంబ విభేదాలు....
గత కొంతకాలంగా పుష్పశ్రీవాణి కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. ఆమె మామ చంద్రశేఖర్ రాజు పుష్పశ్రీ వాణిని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పల్లవిరాజు టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మొత్తం మీద ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పుష్పశ్రీవాణికి కుటుంబం నుంచే వచ్చే ఎన్నికలలో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కురుపాం నియోజకవర్గం అభివృద్ధే తన ధ్యేయమని పల్లవి రాజు తెలిపారు.
Next Story

