Fri Dec 05 2025 16:35:19 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : పవన్ కల్యాణ్ ర్యాంక్ ఇలా పడిపోయిందేమిటి?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ర్యాంక్ పూర్తిగా పడిపోయింది. పదో స్థానానికి ఆయన చేరిపోయారు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ర్యాంక్ పూర్తిగా పడిపోయింది. పదో స్థానానికి ఆయన చేరిపోయారు. మంత్రి వర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రుల పనితీరు ఆధారంగా ర్యాంకులను ప్రకటించారు. పనితీరు మెరుగుపర్చుకోవాలని, ఫైళ్ల క్లియరెన్స్ ను వేగంగా చేయాలని మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రెండో స్థానంలో కందులదుర్గేష్ ఉన్నారు. కొల్లు రవీంద్రపన్నెండవ ర్యాంకుకు వెళ్లిపోయారు. నారాయణ పథ్నాలుగో ర్యాంకులో ఉన్నారని చంద్రబాబు తెలిపారు.
ఫైళ్ల క్లియరెన్స్ లో...
ఫైళ్ల క్లియరెన్స్ లో మొదటి స్థానంలో మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఉండగా, చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఆరోస్థానంలోనూ, మంత్రి నారా లోకేష్ ఎనిమిదో స్థానంలోనూ నిిచారు. ఫైళ్లను వేగంగా క్లియర్ చేయడం వల్ల నిర్ణయాల అమలు సత్వరం జరుగుతాయని చంద్రబాబు మంత్రులకు క్లాస్ పీకారు. పనితీరును కూడా మెరుగుపర్చుకోవాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వన్ సైడ్ గెలుపు ఉండేలా చూసేలా జిల్లా ఇన్ ఛార్జి మంత్రులు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.
Next Story

