Wed Mar 18 2026 23:05:34 GMT+0530 (India Standard Time)
మోదీతో ముగిసిన పవన్ కల్యాణ్ భేటీ.. అరగంటకుపైగానే?
ప్రధాని నరేంద్ర మోదీతో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్ సమావేశం ముగిసింది.

ప్రధాని నరేంద్ర మోదీతో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్ సమావేశం ముగిసింది. పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో ప్రధాని మోదీతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రానికి అవసరమైన సహకారాన్నిమరింతగా అందించాలని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రధానిని కోరారు.
రాష్ట్రాభివృద్ధికి సంబంధించి...
ప్రధాని నరేంద్ర మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం దాదాపు అరగంట పైగానే సాగింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలుపుకు సంబంధించి ప్రధానికి అభినందనలు తెలియజేసిన పవన్ కల్యాణ్ రాష్ట్రానికి అవసరమైన నిధులు సమకూర్చాలని కోరారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ మంచినీరు అందించేందుకు అవసరమైన నిధులను అందచేయాలని పవన్ కోరినట్లు తెలిసింది. ప్రధాని కూడా పవన్ కల్యాణ్ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు.
Next Story

