Thu Dec 18 2025 22:59:41 GMT+0000 (Coordinated Universal Time)
ప్రధాని మోదీతో భేటీపై పవన్ ఏమన్నారంటే?
ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు

ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ‘ మోడీ నాపై చూపే అభిమానం.. ఆప్యాయత ఎంతో విలులైనది.. పార్లమెంటు సమావేశాల మధ్య తన విలువైన సమయాన్ని నా కోసం కేటాయించారు. గాంధీనగర్లో మోడీతో నా తొలి సమావేశం నుంచి ఈ భేటీ వరకు, మోడీకి పని పట్ల నిబద్ధత, దేశం పట్ల ప్రేమ నిజంగా స్ఫూర్తిదాయకం’ అని పేర్కొన్నారు.
ప్రత్యేకంగా సమావేశమై...
తనతో ప్రత్యేకంగా సమావేశమైన ప్రధాని మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. నిన్న ప్రధాని మోదీతో సమావేశమైన పవన్ కల్యాణ్ రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలను చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల గురించి ఆయన మోదీకి వివరించారు. ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు.
Next Story

