Sun Mar 15 2026 15:03:51 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : పిఠాపురం మహిళలకు జనసేనాని కానుక
ఈ ఎన్నికల్లో ఆదరించి గెలిపించిన పిఠాపురం నియోజకవర్గం మహిళలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పెషల్ గిఫ్ట్ పంపారు

ఈ ఎన్నికల్లో ఆదరించి గెలిపించిన పిఠాపురం నియోజకవర్గం మహిళలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పెషల్ గిఫ్ట్ పంపారు. ఈరోజు చివరి శుక్రవారం కావడంతో మహిళలకు పన్నెండు వేల చీరలు పంపించారు. ఈరోజు పిఠాపురంలోని పురూహుతికా ఆలయంలో మహిళలు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. ఈ ఏడాది ఈ ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనే పన్నెండు వేల మంది మహిళలకు పవన్ కల్యాణ్ ఆడపడుచు కానుకగా చీరలు పంపారు.
సామూహిక వ్రతాలు...
అయితే చీరలు పంపుతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆలయంలో జరిగే సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనేందుకు ఇస్తున్న టోకెన్ల కోసం నిన్న బారులు తీరారు. కానీ ఆలయంలో ఐదు వేల మందికి మాత్రమే స్థలం ఉండటంతో నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. చీరల కోసం మహిళలు పెద్దయెత్తున తరలి వచ్చే అవకాశముందని అంచనా వేసి అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి తొక్కిసలాట జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
Next Story

