Fri Dec 05 2025 12:23:40 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : రాష్ట్రానికి సమర్థవంతమైన నాయకత్వం ఉండబట్టే
ఆటో డ్రైవర్ల సేవలో ఈ ప్రభుత్వం ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.

ఆటో డ్రైవర్ల సేవలో ఈ ప్రభుత్వం ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రహదారులు అద్వాన్నంగా ఉండటంతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి మరమ్మతులు చేయగలిగామన్నారు. గ్రీన్ ట్యాక్స్ ను తగ్గించగలిగామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలగకుండా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదిహేను వేల రూపాయలు ఏడాదికి ఇస్తున్నారన్నారు. ఆర్థికంగా ఇబ్బందికరమైనప్పటికీ ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు.
మహిళలకు ఉచిత బస్సు పథకం ద్వారా...
సమర్థవంతమైన నాయకత్వం ఉంటే ఏ రాష్ట్రమైనా సుభిక్షంగా ఉంటుందని పవన్ కల్యాణ్ అన్నారు. ఆటోలు, క్యాబ్ లు నడుపుకుని జీవనం సాగించే వారికి అండగా నిలిచేందుకు ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి హామీని నిలబెట్టుకుందన్నారు. ఆటో డ్రైవర్ సేవలో పథకం ద్వారా స్త్రీశక్తి పథకం ద్వారా జరుగుతున్న నష్టాన్ని పూడ్చేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు. చిన్నపాటి ఊతమిచ్చి ఆర్థిక భారమయినా, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వారికి అండగా నిలుస్తామని, సమర్థవంతమైన నాయకత్వం ఉంటే ప్రజల జీవితాల్లో మార్పు తీసుకు రావచ్చని అన్నారు.
Next Story

