Wed Mar 18 2026 12:51:07 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : జనంతో జనసేనాని.. అర్జీలు తీసుకుని?
డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి వెంటనే అధికారులను ఆదేశించారు

డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి వెంటనే అధికారులను ఆదేశించారు. పవన్ కల్యాణ్ కోసం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద అనేక మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. తమ సమస్యలు ఆయనకు చెప్పుకుని వాటి పరిష్కారానికి ప్రయత్నం చేయాలని పవన్ కల్యాణ్ కోరాలని వచ్చారు.
అధికారులతో ఫోన్ లో మాట్లాడి...
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు మధ్యాహ్నం అసెంబ్లీ నుంచి తిరిగి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన సందర్భంలో వివిధ ప్రాంతాల నుంచి తమ బాధలు చెప్పుకొనేందుకు వచ్చిన వారిని చూశారు. వెంటనే కాన్వాయ్ ఆపి ఆఫీస్ ముందు కుర్చీలు వేసుకొని బాధితులతో మాట్లాడి అర్జీలు తీసుకున్నారు. కొన్ని అర్జీలకి సంబంధించి అప్పటికప్పుడు అధికారులతో ఫోన్లో మాట్లాడారు.
Next Story

