Fri Dec 05 2025 13:37:55 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : మత్స్యకారులతో సమావేశమైన పవన్
కాకినాడ కలెక్టరేట్లో అధికారుల కమిటీ, మత్స్యకార ప్రతినిధులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు.

కాకినాడకలెక్టరేట్లో అధికారుల కమిటీ, మత్స్యకార ప్రతినిధులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఉప్పాడ తీరప్రాంత మత్స్యకారుల ఇబ్బందులు, సముద్రంలో కలిసే కంపెనీల వ్యర్ధాల గురించి అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటున్నారు. కల్యాణ్..కాకినాడ కలెక్టరేట్ లో ఉప్పాడ మత్స్యకార సోదరులతో మాట - మంతి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అధికారులతో కాలుష్యాన్ని నివారించేందుకు అవసరమైన చర్యలు ఎలా తీసుకోవాలన్న దానిపై వారిని అడిగి తెలుసుకుంటున్నారు.
కాలుష్య ప్రభావంతో...
కాలుష్య ప్రభావంతో మత్స్య సంపద తగ్గిపోవడమే కాకుండా పర్యావరణానికి ఇబ్బంది కరంగా మారుతుందన్న ఆందోళన నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ప్రభుత్వ విప్ లు దాట్ల సుబ్బరాజు, యనమల దివ్వ, ఎమ్మెల్సీలు హరి ప్రసాద్, కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం, -ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, పంతం నానాజీ, వనమాడి కొండబాబు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీఎస్ఎన్ వర్మ, పెండెం దొరబాబు, పిఠాపురం జనసేన ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాసులు హాజ్యారు.
Next Story

