Fri Dec 05 2025 14:14:43 GMT+0000 (Coordinated Universal Time)
సినీ థియేటర్ల బంద్ పై పవన్ కీలక ప్రకటన
సినిమా థియేటర్ల బంద్ పై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు.

సినిమా థియేటర్ల బంద్ పై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. ఈ నిర్ణయం వెనక జనసేన నేతలతో ఎవరు ఉన్నా వదలొద్దంటూ సినిమాటోగ్రఫీ శాఖ ను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా జనసేన సత్యనారాయణ ఈ నిర్ణయం వెనక ఉన్నారని తెలిసి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సత్యనారాయణకు దాదాపు ఇరవై థియేటర్లు ఉన్నట్లు తెలిసింది.
ఎవరున్నా వదలొద్దంటూ...
అయతే పవన్ కల్యాణ్ మాత్రం థియేటర్ల నిర్వహణతో పాటు అందులో ఆహార పదార్థాల విక్రయాల ధరలపై కూడా దృష్టి పెట్టాలని సినిమాటోగ్రఫి మంత్రిత్వ శాఖను ఆదేశించారు. జనసేన నేతలు ఉన్నారని ప్రచారం జరగడంతో దానిపై కూడా విచారణ జరపాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఎవరు ఉన్నా థియేటర్లు ప్రజలకు వినోదం పంచేవిగా ఉండాలని, అంతే తప్ప దోచుకునే కేంద్రాలుగా తయారు కాకూడదని పవన్ కల్యాణ్ ఆదేశించినట్లు తెలిసింది.
Next Story

