Thu Mar 19 2026 10:04:58 GMT+0530 (India Standard Time)
జగన్ సంస్థపై పవన్ కల్యాణ్ ఆరా
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సరస్వతి పవర్ భూముల పై ఆరా తీశారు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సరస్వతి పవర్ భూముల పై ఆరా తీశారు.పల్నాడు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల్లో సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూముల్లో అటవీ భూములు ఏవైనా ఉన్నాయా? ఉంటే వాటి విస్తీర్ణం ఎంత ఉందో నివేదిక ఇవ్వాలని అటవీ శాఖ అధికారులను పవన్ కల్యాణ్ ఆదేవించారు. ఈ సంస్థకు 1515.93 ఎకరాల్లో ప్రకృతి సంపద, వాగులు, వంకలు, కొండ భూములు ఉన్నాయనే వార్తలు వస్తున్నందున ఉప ముఖ్యమంత్రి అధికార యంత్రాంగంతో చర్చించారు.
ప్రభుత్వ భూములు...
ఆ సంస్థకు చెందిన భూముల్లో ప్రభుత్వ భూములు, జల వనరులు ఏ మేరకు ఉన్నాయో తెలియచేయడంతో పాటు, అటవీ భూములు ఏ మేరకు ఉన్నాయో సమగ్రంగా పరిశీలించి నివేదిక పంపాలని పవన్ అధికారులు కోరారు. వాగులు, వంకలు, కొండలు ఉన్నందున ఆ సంస్థకు పర్యావరణ అనుమతులు ఏ విధంగా పొందారో తెలియచేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈ అంశంపై అటవీ, రెవెన్యూ, పీసీబీ ఉన్నతాధికారులతో త్వరలో ఉప ముఖ్యమంత్రి సమీక్షించాలని నిర్ణయించారు. సరస్వతి పవర్ కార్పొరేషన్ వైఎస్ జగన్ కు సంబంధించి కావడం, దీనిపై పవన్ ఆరా తీయడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది.
Next Story

