Fri Dec 05 2025 15:23:59 GMT+0000 (Coordinated Universal Time)
జనవాణికి వచ్చే వారు ఈ సమయంలోనే రావాలన్న జనసేన
ఆంధ్రప్రదేశ్ లో జనవాణి పని వేళల్లో మార్పులు చేస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో జనవాణి పని వేళల్లో మార్పులు చేస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఇకపై పనివేళలు జనవాణిలో మార్పులు చేసినట్లు కార్యాలయం తెలిపింది. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చే అర్జీదారులు నేటి నుంచి గురువారం వరకూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు వచ్చే అవకాశం కల్పించారు.
ఉదయం, సాయంత్రం...
అలాగే తిరిగి సాయంత్రం 4.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ అర్జీలను ఫిర్యాదుదారుల నుంచి స్వీకరించనున్నారు. జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్ ప్రజల నుంచి వినతులను స్వీకరించేందుకు ఈ ఏర్పాట్లు చేశారు. పవన్ కల్యాణ్ ను కలసి ఆయనకు తమ సమస్యలను చెప్పుకుంటే పరిష్కారం అవుతాయని నమ్ముతారు. అందుకోసమే పెద్దయెత్తున జనసేన కార్యాలయానికి వస్తుండటంతో పనివేళల్లో మార్పులు చేపట్టారు.
Next Story

