Sat Dec 13 2025 22:43:23 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : నేడు ఏలూరు జిల్లాకు పవన్ కల్యాణ్
నేడు ఏలూరు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.

నేడు ఏలూరు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో పవన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దీంతో పాటు పలు కార్యక్రమాలను పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు.
వివిధ కార్యక్రమాల్లో...
ఈ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యణ్ ముప్ఫయి ఎకరాల ఆలయ భూమి పత్రాలను అందించనున్నారు. దీంతో పాటు బీటీ రోడ్డుకు పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. పవన్ కల్యాణ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. అభిమానులు భారీగా చేరుకునే అవకాశముండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story

