Mon Dec 15 2025 08:18:08 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : నెల్లూరు ఘటనపై పవన్ ఏమన్నారంటే?
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఖండించారు.

నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఖండించారు. మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపర్చేలా మాట్లాడారని పవన్ అన్నారు. మహిళలపై అసభ్యకరంగా మాట్లాడటం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందన్నారు పవన్ కల్యాణ్.
అభ్యంతరకరమైనవంటూ...
ప్రశాంతి రెడ్డి పై ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవని, వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం సరికాదని పవన్ కల్యాణ్ అన్నారు. మహిళలను కించపర్చడాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలన్న పవన్ మహిళలను గౌరవానికి భంగం కలిగిస్తే చట్టప్రకారం చర్యలుంటాయని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. శాసనసభలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంవల్లనేప్రజలు సరైన తీర్పు చెప్పారన్న విషయాన్నిగుర్తు చేశారు.
Next Story

