Tue Jan 20 2026 08:47:05 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : మృతుల కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం
అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆర్థికసాయాన్ని ప్రకటించారు

అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆర్థికసాయాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు, గాయపడిన వారికి ఐదు లక్షల రూపాయలు ఇస్తానని ఆయన ప్రకటించారు. దైవదర్శనానికి వెళుతూ ఏనుగుల దాడిలో మరణించిన కుటుంబాలను ఆదుకునేందుకు పవన్ ఈ సాయాన్ని ప్రకటించారు.
గాయపడిన వారిని...
అటవీ శాఖ మంత్రి కావడంతో వెంటనే పవన్ కల్యాణ్ ఈ ప్రమాదంపై స్పందించారు. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ తో మాట్లాడిన పవన్ కల్యాణ్ ఘటన గురించి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు రైల్వే కోడూరు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారికి మెరుగైన వైద్య సేవలను అందించాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.
Next Story

